ఆహా… పవర్ స్టార్ టీజర్ !

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్‌ షో 
‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. సీజన్‌2లో భాగంగా ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇటీవల ఈ షోకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆహా కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో బాలయ్య తో కలిసి పవన్ చేసిన హంగామా ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే పవర్ ఫుల్ గా ఉంది. బాలా.. అని పిలవమని బాలయ్య అడగగా.. తానూ ఓడిపోవడానికి రెడీ కానీ.. అంటూ పవన్ నవ్వులు పూయించారు. ఇక వాడీ.. వేడీ అంటూ రాజకీయాలను టచ్ చేశారు బాలయ్య. అన్నయ్య మెగాస్టార్ నుంచి నేర్చుకోవాలనుకు అంశాలు, నేర్చుకోవద్దు అనే అంశాలు ఏంటీ ? అభిమానుల ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదు.. ? అనే ప్రశ్నలకు బాలయ్య సంధించారు. మరీ.. పవన్ ఏం సమాధానాలు చెప్పారు ? అన్నది ఫుల్ ఏపీసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే.