సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌పై దాడి

ప్రముఖ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌ కు చేదు అనుభవం ఎదురైంది. హంపీ ఉత్సవ్‌’ లో పాల్గొన్న ఆయనపై దాడి జరిగింది. కన్నడ భాషలో పాటలు పాడాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు యువకులు వాటర్‌ బాటిల్స్‌ విసిరారు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారందరూ కంగుతిన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘హంపీ ఉత్సవాలు’ వేడుకగా జరిగాయి. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.