బడ్జెట్‌కు ఆమోదం తెలపని గవర్నర్.. హైకోర్టుకు సర్కార్ !
తెలంగాణలో సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య గ్యాప్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడని రాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై పడింది. వచ్చే ఆర్థిక సంవత్సర (2023-24) బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా… దానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలపలేదు.
మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో దీనిపై సోమవారం హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు. గవర్నర్ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు.