పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు : రాష్ట్రప్రతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

భారత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రసంగించారు. దేశం ఆత్మనిర్భర్‌ భారత్‌గా అవిర్భవిస్తోందని, పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వంలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఇప్పుడు యావత్‌ ప్రపంచం ఆశావహ దృక్పథంతో చూస్తోందని, రాబోయే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడాలన్నారు. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్‌ తయారైందని అన్నారు.

రాష్ట్రప్రతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు :

  • పేదలు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పనిచేస్తోంది.
  • మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు నిర్మించామన్నారు.
  • అన్ని వర్గాల అభివృద్ధికి కృషి జరుగుతోంది.

*రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి.

*భారత్‌ మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోంది. పేదరికం లేని భారత్‌ నిర్మాణం కోసం కృషి జరుగుతోంది.

  • భారత డిజిటల్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరంగా మారింది. *మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం.
  • చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నాం. ఫసల్‌ బీమా యోజన, కిసాన్‌ కార్డు వంటి పథకాలు తీసుకొచ్చాం.
  • పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నాం.

*ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశాం.

  • వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం.

*తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం.