నాని 30.. మెగా క్లాప్

నేచురల్ స్టార్ 30వ సినిమా షురూ అయింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, రచయిత విజయేంద్ర ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ తదితరులు ఓపెనింగ్ కు అటెండ్ అయ్యారు.  మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రానికి దర్శకుడు శేష్ దర్శకత్వం వహించనున్నాడు. నానికి జంటగా మృణాల్ ఠాకూర్ జతకట్టనుంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.

ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’ మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోమవారం ఈ సినిమా టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. మాస్ అవతార్ లో నాని విశ్వరూపం చూపించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ సినిమాల స్థాయిలో దసరా ఉంటుందని నాని చెబుతున్నారు.