తెలంగాణ కొత్త సెక్రెటేరియేట్ ఓపెనింగ్ వాయిదా
తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్వరలో మరో తేదీని తెలిపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న కొత్త సచివాలయం ప్రారంభించాల్సి ఉంది. ఈ అంశంపై సీఈసీతో సీఎస్ సంప్రదింపులు జరిపారు. కానీ సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.