NDA : నో డేటా అవలేబుల్

 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవ రోజు కొనసాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కంప్లీట్ గా కేంద్రం టార్గెట్ గా కేసీఆర్ విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రతీ అంశంలో కేంద్రం ఫెల్యూర్స్ ను ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో “NDA  అంటే నో డేటా అవలేబుల్” అంటూ ఎద్దేవా చేశారు. ఈ విషయం మాజీ కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంట్ లోనే చెప్పారని గుర్తు చేశారు. ఏ విషయంలో అడిగిన కేంద్రం డేటా అవలేబుల్ గా లేదని అంటోందన్నారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి రేషన్ షాపు దగ్గర ఫోటో దిగుతుంది. షాపులో ప్రధాని నరేంద్ర మంత్రి ఫోటో ఎందుకు పెట్టలేదని నిలదీసింది. గిదా.. కేంద్ర మంత్రి చేసేది ? అంటూ విమర్శలు చేశారు. దేశంలో చాలా రైళ్లు ప్రారంభించారు. కానీ ఎప్పుడు ప్రధాని వచ్చి ఓపెనింగ్ చేయలేదు. ఇప్పటి వరకు 11 సార్లు వందే భారత్ ట్రైయిన్స్ ను మోడీ ప్రారంభించారు. ఇదెక్కడి పని అని ఫైర్ అయ్యారు. ఏం చేశారని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు. జనాభా గణన ఎందుకు చేయపట్టం లేదని అడిగారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఇంకా కొనసాగుతూనే ఉంది.