నెట్ ఫ్లిక్స్ లో ‘సార్’

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన తొలి స్ట్రయిట్ తెలుగు మూవీ ‘సార్’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సంయుక్తా మీనన్ హీరోయిన్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ రిలీజ్ రోజునే సార్ ఓటీటీ రిలీజ్ అప్ డేట్ వచ్చింది.

ఈ సినిమా డిజిటల్ రిలీజ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.