సంక్రాంతి కానుకగా #ProjectK.. రిలీజ్ డేట్ ఖరారు !

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్ కె’. ప్రభాస్  కి జంటగా దీపికా పదుకొనె నటిస్తున్నారు. మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా మెరవనుంది. బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  (𝟏𝟐-𝟏-𝟐𝟒) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ప్రాజెక్ట్ కె కంటే ముందు ప్రభాస్ నటించిన రెండు సినిమాలు ఆదిపురుష్, సలార్ రిలీజ్ కాబోతున్నాయి. ఆదిపురుష్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు. కానీ జూన్ 16న రిలీజ్ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.