ఆ పనికి నో చెప్పిన కాజల్

తేజ ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలా రోజుల తర్వాత మళ్లీ తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నే మంత్రి’ సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ తో తేజ తెరకెక్కించనున్న సినిమాలోనూ కాజల్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా సోమవారమే ప్రారంభమైంది. ఇది తేజ మార్క్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో కాజల్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తుందట.

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బెల్లకొండ, సోనూసూద్ సినిమాలో బ్రదర్స్ లా కనిపిస్తారట. ఐతే, ఈ సినిమాలో బెల్లకొండ, కాజల్ ల మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. వాస్తవానికి దగ్గర సినిమా తీయడం తేజ శైలి. ఈ నేపథ్యంలో రొమాంటిక్ సీన్స్ ని అంతే నాచురల్ గా తెరకెక్కిస్తారు. సరిగ్గా లేదనుకొంటే ఒకటి రెండు సార్లు కిస్సులు, హగ్ లు చేయిస్తాడు.

కాజల్ మాత్రం బెల్లకొండతో లిప్ లాక్ లు ముందే నో చెప్పిందట. స్టార్ హీరోల సినిమాల్లోనే ఆచితూచి కిస్సులు ఇస్తుంటా. బెల్లకొండ ఆ ఛాన్స్ ఇవ్వదలుచులోలేదు. కావాలంటే పారితోషికం తగ్గించిన ఫర్వాలేదని తేల్చి చెప్పిందట. బెల్లకొండ చేసిన గత మూడు సినిమాలు అల్లుడు శ్రీను, స్వీడున్నోడు, జయజానకి నాయక లోనూ స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లతో బెల్లకొండ పెద్దగా రొమాన్స్ చేసిన దాఖల్లాలేవ్. మరీ.. ఏ హీరోయిన్ ఈ యంగ్ హీరోకు ఆ ఛాన్స్ ఇస్తుందో చూడాలి.