రేణు పెళ్లి ప్లాన్స్ ఇవే.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి జరగనుంది. ఐతే, చేసుకోబోయే భర్త వివరాలు రేణు చెప్పడం లేదు. ఇక, పెళ్లి ఎప్పుడు ? ఎక్కడ ?? అనే విషయాలని సీక్రెట్ గా ఉంచింది. ఇప్పుడీ వివరాలు బయటికి లీకయ్యాయి. చాలా సింపుల్ గా రేణు పెళ్లిని ప్లాన్ చేసినట్టు తెలిసింది.

కేవలం కుటుంబ వేడుకకగా పెళ్లి తంతుని ముగించనున్నారు. కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో పెళ్లి జరగనుంది. ఆ తర్వాత గ్రాండ్ విందు ప్లాన్ కూడా లేదు. పెళ్లి రోజున అనాదలకు అన్నదానం చేయాలని అనుకుంటున్నారు. బహుశా.. పెళ్లి డేటుని బయటికి చెప్పకుండా.. పెళ్లి తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపవచ్చని చెబుతున్నారు.

ఇక, రేణుని పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి ఇప్పటికే పెళ్లైయిందని తెలిసిందే. ఆయనకు ఓ పాప కూడా ఉందట. ఆ పాప రేణు పిల్లలకు స్నేహితురాలని తెలిసిందే. పిల్లల ద్వారానే ఆయన పరిచయం కావడం.. రేణుకు నచ్చడం.. అది కాస్త పెళ్లి వరకు దారితీసినట్టు సమాచారమ్.