చెరుకు సుధాకర్ ను చంపేస్తాం.. కోమటిరెడ్డి వార్నింగ్ !
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ చెరుకు సుధాకర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన మరో కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ను చంపేస్తాం. అయన్ని చంపడానికి వంద వాహనాల్లో తిరుగుతున్నారు. దొరికితే ఖతమే. ఈ వారం రోజుల్లో చంపేస్తారు అని కాంగ్రెస్ నేతకు చెందిన ఓ యువకుడి కొడుకుతో వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో భువనగిరి పట్టణంలో బీసీ నేతలు ధర్నాకు దిగారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడీ.. ఈ వ్యవహారం ఒక్క భువనగిరిలో మాత్రమే కాదు.. స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇంటి పార్టీ ని ఏర్పాటు చేసిన చెరుకు సుధాకర్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన చేరికను వెంకట్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. నల్గొండలో నన్ను ఓడిస్తానని సవాల్ చేసిన సుధాకర్ ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆయన పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీలో చేరిన చెరుకు సుధాకర్ కు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు. సుధాకర్ కూడా వెంకట్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నేరుగా ఆయన పేరును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. బహుశా.. ఇదే వెంకట్ రెడ్డికి ఇరిటేట్ తెప్పించినట్టుంది. నేరుగా ఓ కాంగ్రెస్ నేత కొడుక్కి ఫోన్ చేసి.. చెరుకు సుధాకర్ ను చంపేస్తారు. నువ్వు కూడా లిస్టు లో ఉన్నావు. జాగ్రత్త బిడ్డా అంటూ హెచ్చరికలు చేశారు.