11న కవిత అరెస్ట్ ?

బీజేపీ నేతలు ముందు నుంచి చెబుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ టైమ్ రానే వచ్చింది అంటున్నారు. ఆమెకు సీబీఐ నుంచి పిలుపొచ్చింది. ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి. అయితే ముందే ఫిక్సయిన షెడ్యూల్ ప్రకారం తాను బిజీగా ఉన్నాను. రాలేను. ఈ నెల 15 తర్వాత ఎప్పుడు రమ్మన్నా వస్తానని సీబీఐ అధికారులకు కవిత మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని ప్రచారం జరుగుతుంది. కానీ 11న కవితను పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదేరోజున ఆమెను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ఈ నెల 10న బీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనపక్షం, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేరోజున అసెంబ్లీను రద్దు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు. మొత్తానికి.. ఈ వారం రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నట్లు తెలుస్తోంది.