ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. కవిత దీక్షకు పోటీగా బీజేపీ దీక్ష !

ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11 తేదీ ఉదయం 11 గంటలకు కవితను ఈడీ విచారించనుంది. అయితే అంతకంటే ముందు అనగా.. రేపు మహిళా రిజర్వేషన్ల అమలు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే కవిత దీక్షకు పోటీగా బీజేపీ మహిళలు హైదరాబాద్ లో దీక్ష చేయాలని నిర్ణయించారు.  రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. విపక్ష నేతలను మాత్రమే బీజేపీ టార్గెట్ చేస్తుంది. కేసుల్లో ఇరుకుస్తుందని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ తల వంచదు అని కవిత స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఢిల్లీ లిక్కర్ సాం కు తెలంగాణకు ఏం సంబంధమని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోరు పీక్స్ కి చేరినట్లు కనబడుతుంది.