జంతర్‌ మంతర్‌ వద్దనే కవిత దీక్ష !

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం రేపు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టే నిరహార దీక్ష విషయంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మొదట అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. ఆ తర్వాత పర్మిషన్ రద్దు చేస్తున్నాం. దీక్ష వేదిక ను మార్చుకోవాలని సమాచారం ఇవ్వడంతో కన్ఫూజన్ ఏర్పడింది.

అయితే పోలీసులతో బీఆర్ఎస్ ప్రతినిధులు మాట్లాడటంతో.. దీక్షకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత నేతృత్వంలో దీక్ష చేయనున్నారు. ఈ దీక్షను సీతారం ఏచూరు ప్రారంభించనున్నారు. మొత్తం 18 పార్టీలు మద్దతు ప్రకటించినట్లు కవిత చెప్పారు. ఇక ఎల్లుండి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణకు హాజరుకాబోతున్నారుఅదే రోజు ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.