త్రివిక్రమ్‌తో నాని సినిమా


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ప్రతి హీరో కోరుకుంటారు. నేచురల్ స్టార్  నాని కూడా ఆ కోరిక ఉన్నట్టుంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా ఈ నెలలోనే (మార్చి 30) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని.. దసరా ఒక సినిమా కాదు. రెండు భాగాలు. 2 పార్ట్స్ ను ఒకే సినిమాలో చూస్తారని చెప్పారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. ఈ కథలోని పాత్రలు మీకు దగ్గరగా ఉన్నట్లు ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఇక “త్రివిక్రమ్‌ నా కోసం స్క్రీప్ట్‌ రాయాలని చెప్పారు. ఒకవేళ ఆయనతో నేను సినిమా తీస్తే అది నా జీవితంలో కచ్చితంగా ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుంది. భవిష్యత్తులో ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా”నని చెప్పుకొచ్చారు.