‘ఖుషి’ రిలీజ్ డేట్ ఫిక్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరో సమంత ‘ఖుషి’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. తాజాగా ఈ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సెప్టెంబర్ 1న ఖుషి ని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విజయ్-సమంతల ఫ్రెష్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ స్మార్ట్ గా, సామ్ క్యూట్ గా కనిపిస్తున్నారు.

లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక ఖుషి కంటే ముందే సమంత నటించిన శాకుంతలం రిలీజ్ కానుంది. నిన్నుకోరి, మజిలీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తీసిన దర్శకుడు శివ నిర్వాణ. ఖుషి కూడా అదే తరహా సినిమా అని తెలుస్తోంది.