ధరణి ‘వర్సెస్’ రావణాసుర.. ఫుల్ వీడియో !

ఒకరు మాస్ మహారాజా.. మరొకరు నేచురల్ స్టార్ నాని. వీరిద్దరు కలిసి ఓ అరగంట పాటు ముచ్చట్లు పెడితే.. స్పెషలే మరీ ! దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి ఇంటర్వ్యూ ఫుల్ వీడియో ఈ సాయంత్రం రిలీజ్ కాబోతుంది. దీంతో.. రవితేజ-నాని ఫుల్ వీడియో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాని నటించిన దసరా (మార్చి 30), రవితేజ నటించిన రావణాసుర (ఏప్రిల్ 7) వారం గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్, సినిమాల గురించి రవితేజ-నాని తెగ మాట్లాడేసుకున్నారు. విక్రమార్కుడు లాంటి పాత్ర వస్తే ఖచ్చితంగా చేస్తానని నాని చెప్పడం.. సినిమా కష్టాలు ఒకరినొకరు పంచుకోవడం ప్రోమోలో ఆకట్టుకుంది. రవితేజ మార్క్ పంచ్ లో.. నాని మార్క్ కన్విన్సింగ్ ఆన్సర్స్ ఆకట్టుకున్నాయి. మరీ.. ఫుల్ వీడియోలో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో చూడాలి.