టెన్త్ పేపర్ లీక్.. ఏ1గా బండి సంజయ్ !

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం.. ఆ తర్వాత టెన్త్ తెలుగు, హిందీ పేపర్లు వరుసగా లీక్ కావడంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీకుల వ్యవహారం వెనుక బీజేపీ ఉందని ఏకంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన్ని ఏ1గా చేర్చారు. దీంతో.. పేపర్ లీకేజీ వ్యవహారంలో.. ఒక్కసారిగా మూమెంటమ్ మారినట్టు కనబడుతుంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పై విద్యార్థులు, ప్రజలు విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ పాపంలో బీజేపీ భాగం ఉన్నట్టు క్రియేట్ చేశారు. అయితే అది నిజమా ? కాదా ? అన్నది న్యాయస్థానాల్లో తేలనుంది. దానికి కొద్దిరోజుల టైమ్ పట్టనుంది. ఈ లోగా జరిగిన డ్యామేజ్ లో బీఆర్ ఎస్ తో పాటు బీజేపీ పాలు పంచినట్టు అయింది. 

ఇక ఈ కేసులో బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్కడి నుండి మొదట హైదరాబాద్ తరలించారు.. తర్వాత వరంగల్ వైపు తరలించారు. పేపర్ ఇలా బయటకు రావడం వెనుక బండి సంజయ్ కుట్ర ఉందని బయట బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ బయటకు పంపిన నిందితుడికి బండి సంజయ్ చాలా సార్లు కాల్ చేశారని… ఆయనకు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో అందిందని ప్రచారం చేస్తున్నారు. అయితే పరీక్షఅయిపోయిన రెండు గంటల తర్వాత బండి సంజయ్ ఫోన్‌కు పేపర్ వస్తే కుట్ర ఎలా అవుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వవ్యహారం రాజకీయ దుమారం రేగుతోంది. మరోవైపు బండి సంజయ్ నేరం చేసేశారని.. బీఆర్ఎస్‌తో పాటు టీవీ9 లాంటి మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మొత్తానికి.. పేపర్ లీకేజీల వ్యవహారంలో బీఆర్ఎస్ తనపై పడిన నిందలో బీజేపీని భాగం చేయడంలో విజయవంతం అయిందని చెప్పవచ్చు.