రాజస్థాన్ టార్గెట్ 198

ఐపీఎల్-16 లో భాగంగా ఈరోజు అస్సాంలోని గువాహటి బర్సాపుర క్రికెట్‌ స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన  కెప్టెన్ రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలి విరుద్ధంగా ఈసారి డిఫరెంట్ షాట్స్ ట్రై చేశాడు ధావన్. అతడికి తోడు ప్రభు సిమ్రన్ (60) రాణించడంతో.. పంజాబ్ స్కోర్ 200 లకు చేరువైంది.

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదుత్ పడిక్కల్‌, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ కు 198 టార్గెట్ ను చేధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆర్ ఆర్ ను పంజాబ్ ఎలా నిలవరిస్తుంది అన్నది చూడాలి.