పుష్ప 2 కథలో కొత్త కోణం !

పుష్పరాజ్ వేట మళ్లీ మొదలైంది. వేర్ ఈజ్ పుష్ప ? పేరిట రెడీ చేసిన పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. రేపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఒకరోజు ముందుగానే అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ వీడియోను చూస్తే.. ఓ కోణం కనిపించింది.

పార్ట్-1 లో పుష్ప రాజ్ ఎదిగే క్రమాన్ని చూపించారు. దానికోసం ఆయన చేసిన తెగ్గింపు ఆవిష్కరించారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు సంపాదించిన పుష్ప.. ఆ మొత్తాన్ని దేని కోసం ఖర్చు చేశారు అన్నది పార్ట్ – 2 లో చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో.. పుష్ప చనిపోయాడనే న్యూస్ వైరల్ కావడంతో.. ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనలు చేయడం.. అసలు పుష్ప మాకోసం ఏం చేశాడో తెలుసునా.. అంటూ చెప్పడం ఆకట్టుకుంది. 


ఇక పార్ట్ 2 లో పుష్ప ఎంట్రీ అదిరిపోయింది. అడవిలో పుష్ప ను చూసి పులి రెండడుగులు వెనక్కి వేయడం .. మాస్ లుక్ లో పుష్ప ఎంట్రీ అదిరిపోయింది. మరోవైపు అమ్మవారు ఆవహించినట్టు ఉన్న పిక్ ను ఫస్ట్ లుక్ గా వదిలారు మేకర్స్. కానీ ఒక్కటి మిస్ అయింది. పుష్ప పార్ట్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ లో తగ్గేదేలా.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ ను వదిలారు. అయితే పార్ట్ 2 లో అలాంటి డైలాగ్ మిస్ అయింది.