హాస్పిటల్ లో చేరిన కుష్బూ

 సీనియర్ హీరోయిన్ కుష్బూ తీవ్ర జ్వరం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటోలను షేర్‌ చేసి తన ఆరోగ్య పరిస్థితి వివరించారు.

“జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం అన్నీ వేధిస్తున్నాయి. అదృష్టవశాత్తు నేను మంచి ఆసుపత్రిలో చేరాను. ఆరోగ్యం కొంచెం బాలేకపోయినా దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. అలా పట్టించుకోకపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది” అని ట్వీట్‌ చేశారు.