భయపెట్టిన బండి సంజయ్ ఫోన్ ?

పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫోన్ చాలా కీలకమని పోలీసులు అంటున్నారు. ఆయన ఫోన్ ఇస్తే బండారం మొత్తం బయటపడుతుంది అంటున్నారు. మరోవైపు తన ఫోన్ పోయింది. పోలీసులే వెతికి పెట్టాలని కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంజయ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తన ఫోన్ ను పోలీసులే తీసుకున్నారు. అది ఇప్పటికే సీఎం కేసీఆర్ చేతికి చేరింది. అది చూసిన కేసీఆర్ కు మూర్చ వచ్చింది అని సంజయ్ ఎద్దేవా చేశారు. ఎందుకంటే ? తన ఫోన్ లో చాలా రహస్యాలు ఉన్నాయి. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారు. చాలా సార్లు మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల లిస్ట్ చూసి కేసీఆర్ వణికిపోతున్నారని బండి సంజయ్ అన్నారు.

నిజానికి ఇది ఎన్నికల కాలం. పార్టీ ఫిరాయింపులు సహజం. గతంలో సిట్టింగులకు ఈసారి మొండిచేయి. ఈసారి టికెట్లు ఇచ్చేది సీఎం కేసీఆర్ కాదు.. ప్రశాంత్ కిషోర్ అని కేటీఆర్ ప్రకటనలు చేసినప్పుడు.. చాలామంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం జరిగింది. టికెట్ ఒకట్రెండు పార్టీల్లో ఖర్చీఫ్ వేసి ఉంచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లోసారి సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ ప్రకటన ఊపిరి పీల్చుకున్నారు. ఫిరాయింపు ప్రయత్నాలు ఆపారనే వార్తలు వినిపించాయి. ఐతే కేసీఆర్ ను ఇంకా పూర్తి స్థాయిలో నమ్మని కొందరు కారు నేతలు… బీజేపీ, కాంగ్రెస్ తో టచ్ లోనే ఉన్నారని టాక్. తాజాగా బండి సంజయ్ కామెంట్స్ తో నిజంగానే గులాబీ పార్టీలో భయం కనిపిస్తుంది అంటున్నారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల లిస్ట్ అంటూ బండి సంజయ్ మైండ్ గేమ్ ఆడుతున్నారని కొందరు లైట్ తీసుకుంటున్నారు.