#SSMB29 : రామాయణం నేపథ్యంలో జంగిల్ అడ్వెంచర్.. హనుమాన్ ప్రేరణతో మహేష్ క్యారెక్టరైజేషన్

యూనిక్ కాన్సెప్ట్ & క్యారెక్టరైజేషన్ తో సినిమాలు తీయడం దర్శకధీరుడు రాజమౌళి. అదే ఆయన విజయ రహస్యం. ఇప్పుడు మహేష్ (#SSMB29) సినిమా కోసం కూడా జక్కన్న ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నారట. జంగిల్ అడ్వెంచర్ గా #SSMB29 ఉండబోతుందని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇందులో మహేష్ పాత్ర కోసం హనుమాన్ ను ప్రేరణగా తీసుకున్నారట. అడవికి వెళ్లి సంజీవనిని తీసుకొచ్చే పాత్రలో మహేష్ కనిపిస్తారట. ఈ క్రమంలో విలన్ గ్యాంగ్ తో జరిగే పోరాట సన్నివేశాలు నా భూతో నా భవిష్యత్తి అన్నట్టు ఉంటాయట.

మరోవైపు ఈ ప్రాంచైజీ లో కమల్ హాసన్, చియాన్ విక్రమ్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించబోతున్నారు.  హీరోయిన్స్ గా  జెన్నా ఒర్టెగా తో పాటు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపిక అయినట్టు  బజ్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాని మూడు భాగాల ప్రాంచైజీగా తీసుకొచ్చే ప్రయత్నాల్లో జక్కన్న ఉన్నట్లు చెబుతున్నారు. రానున్న 8 ఏళ్లలో మూడు భాగాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశారట.