సమంతకు అస్వస్థత.. సీరియస్ కాదు కదా ?

మయోసైటిస్‌ నుంచి కోలుకుంటోన్న స్టార్ హీరోయిన్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఖుషి, ‘సిటాడెల్‌’ సినిమాల షూటింగ్ లో పాల్గొంటూనే.. మరోవైపు శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సామ్. ఈ క్రమంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో బుధవారం సాయంత్రం జరగనున్న ‘శాకుంతలం’ ప్రమోషనల్‌ కార్యక్రమంలో పాల్గొనడం లేదని సామ్ వెల్లడించారు. వరుస ప్రమోషన్స్‌, షూటింగ్‌ షెడ్యూల్స్‌ వల్ల దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం, గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నా. ఈ రోజు సాయంత్రం ఎంఎల్‌ఆర్‌ఐటీలో జరగనున్న వార్షికోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. మా టీమ్‌తో కలిసి మీరూ పాల్గొనండి. మీ అందర్నీ నేను మిస్‌ అవుతున్నా’నని సామ్ ట్వీట్ చేశారు.

శాకుంతలం కు గుణశేఖర్‌ దర్శకుడు. శకుంతలగా సామ్ నటించగా.. మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్ర పోషించారు. ఈ శుక్రవారమే శాకుంతలం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని చెబుతున్నారు.