దళపతితో గోపీచంద్ సినిమా

టాలీవుడ్ – కోలీవుడ్ కాంబో మరో ఆసక్తికర అప్ డేట్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో దళపతి విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే గోపీచంద్ విజయ్ కి కథ వినిపించారు. అది విజయ్ కి బాగా నచ్చేసింది. సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారని టాక్.

యాక్షన్ ఎంటర్ టైనర్లు తెరకెక్కించడంలో గోపీచంద్ దిట్ట. ఆయన ఆఖరి రెండు చిత్రాలు క్రాక్, వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ జోష్ లోనే ఆయన విజయ్ కోసం ఓ అద్భుతమైన కథను రాసుకున్నారు. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఎవరు ? మిగతా డిటేల్స్ త్వరలోనే తెలియనున్నాయి.