బాత్రూమ్లో కూర్చొని ఆ పని చేసేదాన్ని !
ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. హాలీవుడ్ స్టేజ్ మీద అనర్గలంగా మాట్లాడే స్థాయి ఆమెది. అయితే స్కూల్ లో చదువుకునే టైమ్ లో ఆమె చాలా సిగ్గుపడేదట. హైస్కూల్ కోసం అమెరికాకు వెళ్లిన కొత్తలో భయం భయంగా ఉండేది. అక్కడివారితో ఎలా స్నేహంగా ఉండాలో మొదట అర్థం కాలేదు.
క్యాంటీన్‌కు వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. డింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకుని.. ఎవరూ చూడకుండా బాత్రూమ్లోకి వెళ్లి తినేసి.. క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిపోయేదాన్ని. అయితే క్రమక్రమంగా నాలో భయం పోయింది. స్కూల్లో ఉన్న ఇతర పిల్లలతో ఫ్రెండ్షిప్ కోసం ఎంతో మారాను. ఫ్రెండ్స్‌తో డేట్‌కు వెళ్లడం, లేట్ నైట్ పార్టీలు.. ఇలాంటివి మా కుటుంబంలో అనుమతించరని నా ఫ్రెండ్స్‌కు అర్థమయ్యేలా చెప్పానని ప్రియాంక చెప్పుకొచ్చింది.
ప్రియాంక నటించిన ‘సిటడెల్’ వెబ్‌సిరీస్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో ప్రియాంక నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగానే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చింది గ్లోబల్ స్టార్.