ఓటీటీలో ‘శాకుంతలం’.. ఎందులో స్ట్రీమ్ అవుతుందో తెలుసా ?

స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. మోహన్ బాబు, దేవ్ మోహన్, అదితి బాలన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ పౌరాణిక సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఇప్పుడీ.. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సమంత అభిమానులకు ఇది సడన్ సప్రైజ్ నే. ఇటీవల కాలంలో థియేటర్స్ లో పెద్దగా ఆడని సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో శాకుంతలం కూడా చేరుతుందేమో చూడాలి. 

కాళిదాసు ర‌చించిన సంస్కృత నాట‌కం అభిజ్ఞాన శాకుంత‌లంలోని శ‌కుంత‌ల – దుష్యంతుల ప్రేమ‌కావ్యం  ఓ అపురూప దృశ్య కావ్యంలా అందంగా ఆవిష్క‌రింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు గుణ‌శేఖ‌ర్‌. అయితే క‌థ‌లో వేగం.. బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ లేక‌పోవడం వలన ద‌ర్శ‌కుడి వృథా ప్ర‌యాసే అయింది. నాసిర‌కమైన త్రీడీ హంగులు, న‌త్త‌న‌డ‌క‌న సాగే క‌థ‌నం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ఫలితంగా సమంత ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం ప్లాప్ అయింది.

#Shaakuntalam Steaming on @PrimeVideoIN in #Telugu, #Hindi, #Tamil, #Malayalam & #Kannada.#Samantha @Samanthaprabhu2 #Shaakuntalamonprimevideo pic.twitter.com/B3Ym6Bv8MK— OTTRelease (@ott_release) May 11, 2023