ఈ వారమే పరిణీతి ఎంగేజ్మెంట్ !
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ ప్రేమలో ఉన్నారు. అతి త్వరలో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వారమే (మే 13)న వీరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. ఢిల్లీలో వారి సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోనున్నారు.
ఈ వేడుకలో పరిణీతి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అధునాతన సూట్ ధరించనున్నట్లు సమాచారం. ఇది చాలా సింపుల్ అండ్ క్లాస్ గా ఉండేలా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్ నెలాఖరులోగా వీరి విహహం జరగనుందని సమాచారం. గత కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. కలిసి బయటికి వెళ్తున్నారు. ఇటీవల ఫారిన్ టూర్ కి కూడా వెళ్లొచ్చారు. కలిసి చదువుకున్న వీరిద్దరు.. జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.