అలా అయితే ఐపీఎల్-2023 విజేత గుజరాత్

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్ వర్షార్పాణం అయింది. టాస్ పడక ముందు నుంచి వాన షురూ అయింది. ఆఖరికి 5 ఓవర్ల మ్యాచ్‌ అయినా జరగాలని కోరుకున్న ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లింది.

మధ్య మధ్యలో వాన వెలిసిన..  ఆట సాగడం సాధ్యం కాలేదు. దీంతో  అంపైర్లు మ్యాచ్ ను వాయిదా వేశారు. రిజర్వ్‌ డే అయిన రేపు (మే 29) ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. అయితే రేపు కూడా ఇలాగే వర్షం పడి మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే.. లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. అలా జరిగితే 14 మ్యాచ్‌ల్లో 10 విజయలు సాధించిన గుజరాత్ టైటాన్స్‌ ఛాంపియన్‌గా నిలవనుంది.