గుంటూరు కారం.. మహేష్ దిమ్మతిరిగే యాక్షన్ !

మహేష్ – త్రివిక్రమ్ కలిసి ఘాటు లేపారు. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘గుంటూరు కారం’. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ లాంటిది ఒకటి వదిలారు. సుమారు ఒక్క నిమిషం నివిడి గల ఈ వీడియోలో.. సినిమా ఘాటు మొత్తం చూపించారు. చిన్న యాక్షన్ ఏపీసోడ్ తో మహేష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ టైమ్ లోనే “ఏందీ.. బీడీ త్రీడీలా కనబడుతుందా ?” అంటూ త్రివిక్రమ్ మార్క్ ప్రాస డైలాగ్ అదిరిపోయింది. కనిపించినంత సేపు మహేష్ బీడీ తాగుతూ హాట్ గా కనిపించారు.

ఒక్కమాటలో చెప్పాలంటే.. గుంటూరు కారం పోకిరికి అడ్వాన్స్ లా కనబడుతుంది. స్లిమ్ గా గడ్డం లుక్ లో జులపాల జుట్టులో మహేష్ కటౌట్ అదిరిపోయింది. ప్రస్తుతానికైతే.. కథ-కథనం లీక్ చేయకుండా.. సినిమాలో డెప్త్ ఏ రేంజ్ లో ఉంటుందో శాంపిల్ మాత్రం చూపించారు. ఈ సినిమాలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే, శ్రీలీలా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రానుంది.