95 నుండి 105 స్థానాల్లో గెలుస్తాం !

సీఎం కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ 105 మంది తో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేశారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగులను మార్చారు. తాను గజ్వేల్, కామారెడ్డిలలో పోటీ చేయబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారాని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు 95 నుంచి 105 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. సర్వేల ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్.. మేము చేసిన అభివృద్ధితో నమ్మకంగా చెబుతున్నామని చెప్పారు. బయట ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరి బలాలు వారికి ఉంటాయన్నారు.