సోనియా, రాహుల్‌తో వైఎస్ షర్మిల భేటీ.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ షురూ !
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా ఫైనల్ టాక్స్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు. అంతేకాదు.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేసేందుకు అన్ని అడ్దంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం లోగా విలీనంపై అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
వాస్తవానికి షర్మిల రాకను తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ బిడ్డ తెలంగాణలో రాజకీయాలు చేయడం ఏంటని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కావాలంతే ఏపీ రాజకీయాల్లోకి స్వాగతిస్తాం. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలకు మద్దతు తెలుపుతామని బహిరంగ వ్యాఖ్యలే చేశారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటోళ్లు మాత్రం వైఎస్ ఆర్ బిడ్ద కాంగ్రెస్ లో చేరుతానంటే.. ఎలా వద్దమంటామని అన్నారు. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హస్తం హైకమాండ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.