జైలుకు చంద్రబాబు.. తెదేపా నేతల హౌస్ అరెస్టులు.. రోడ్ల మీదకు కార్యకర్తలు !

స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ని రాజేంద్ర మహేంద్రవరం జైలుకి తరలించారు. మరోవైపు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో 144 సెక్షన్ విధించారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే మండల, నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలను సైతం హౌస్ అరెస్ట్ చేయడంతో.. బంద్ కార్యక్రమం సంపూర్ణం కాకుండా సర్కార్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

అందుకే చంద్రబాబుకు మద్దతిస్తున్నాం : పవన్‌ 
ఇవాళ టీడెపీ ఇచ్చిన బంద్ కు జనసేన, సీపీఐ తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. విశాఖపట్నంలో గొడవ జరిగినప్పుడు చంద్రబాబు వచ్చి మాకు మద్దతు తెలిపారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు… తిరిగి ఆ వ్యక్తి కోసం నిలబడటం సంస్కారం. అందుకే చంద్రబాబుకు మద్దతు ఉంటుందని పవన్ తెలిపారు.  ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రతిపక్షాలకు బలమిస్తున్నాయి. జనసేన, తెదేపాకు ఇది బలమిస్తుందని పవన్ అననరు. వైకాపా ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మీరు చేసే పనులకు ఎవరూ భయపడరు. ఇంకాస్త దృఢంగా మారుతాం. బెయిల్‌ మీద వచ్చినోడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అది మన దౌర్భాగ్యమని పవన్ ఘూటు వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఈ దేశంలో చట్టాలు సంపూర్ణంగా పని చేస్తే అసలు జగన్‌ ముఖ్యమంత్రి కాలేరని పవన్ కామెంట్ చేశారు.