సునీత కే నర్సాపూర్ టికెట్
ఎట్టకేలకు నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు తెర పడింది. సునీతా లక్ష్మారెడ్డి వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు. ఆమెకు బీఫామ్ ఇచ్చారు. మదన్ రెడ్డి చేతుల మీదుగానే సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫామ్ ఇప్పించారు. మదన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు. ఆయన సునీతను గెలుపు కోసం సహకరించేందుకు అంగీకరీంచడం సంతోషక విషయం అన్నారు సీఎం కేసీఆర్. ఇక మదన్ రెడ్డికి ఎంపీగా అవకాశం ఇస్తాం. మెదక్ ఎంపీ బీఆర్ ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.
మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు, సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి వుంది. నాతో పాటు కలిసి సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని సీఎం కేసెఆర్ చెప్పుకొచ్చారు.