కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి.. !

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఆయన తిరిగి సొంతగూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని ఆయన కమలం గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కారణం చెబుతూ.. తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ను ఓడించే సత్తా ఇప్పుడు కాంగ్రెస్ కే ఉందని చెప్పారు. ఆయన రేపో.. మాపో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

కవిత అరెస్ట్ కాకపోవడం నిరాశపరిచింది. కమలం పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తప్పు చేసిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ-బీఆర్ ఎస్ ఒక్కటేనని ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం బీఆర్ ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని ఆ పార్టీలో చేరాను. కానీ బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలతో నిరాశ చెంది.. కేసీఆర్ ను గద్దె దించే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి మీడియాకు వివరించారు.

రాజగోపాల్ రెడ్డి తనతో మాట్లాడలేడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీఎం అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 నుండి 80 సీట్లు వస్తాయని ఆయన అన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల.. తదితరులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇప్పుడేమైంది ? అని ఈటల ప్రశ్నించారు.