ఆ పని మూడు నిమిషాల్లో ముగించేస్తా !

సినీ పరిశ్రమలో పడకగది పిలుపులు సహజమే. దాన్నే కమిట్మెంట్ పేరుతో డీల్ చేసుకుంటుంటారు. చాలా మంది హీరోయిన్స్ కమిట్మెంట్ ప్రాబ్లమ్ ను ఎదుర్కొన్నవారే. వీరిలో కొందరు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకు చెప్పారు కూడా. ఈ నేపథ్యంలో ఆ మధ్య మీటూ ఉద్యమం ఊపుందకుంది. ఇప్పటికీ కూడా ఒకరిద్దరు కమిట్మెంట్ వ్యవహారాలపై ఓపెన్ గా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ చేరింది.

ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  కాస్టింగ్ కౌచ్‌ ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పుకొచ్చింది. ఒక సినిమా గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు ఎదుటి వారు ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారో మొదటి మూడు నిమిషాల్లోనే అర్థం అయిపోతుంది. మన నుండి ఏదైనా ఆశిస్తున్నారని తెలిసినప్పుడు నా భర్త, పిల్లల గురించి చెప్తాను. దీంతో వాళ్లు నా ముందు ఆ టాపిక్ తీసుకురారని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఇలాంటి వ్యవహారాల్లో కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్లు వ్యవహరించాలని సూచించింది.