ప్రియుడితో జాన్వీ పెళ్లి ఫిక్స్ !
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్స్ చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్‌తో జాన్వీ డేటింగ్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడితోనే జాన్వీ పెళ్లి తిరుపతిలో ఘనంగా జరగనుంది. అంతేకాదు.. బంగారు చీర కట్టుకొని జాన్వీ పెళ్లి చేసుకోనుంది. అయితే ఇదంతా జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్ మెంట్ కాదు. ఓ నెటిజన్ ఫిక్స్ చేసిన పెళ్లి వేడుక. అవునూ.. తిరుపతిలో జాన్వీ పెళ్లి జరగనుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు జాన్వీ కపూర్ స్పందించడం విశేషం. ‘ఏదైనా రాస్తారా..’ అని రిప్లై ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ‘దేవర’తో జాన్వీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ డ్రామా ఇది. అక్టోబర్ 10న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు రామ్ చరణ్-బుచ్చిబాబుల కాంబోలో రానున్న సినిమాలోనూ జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే.