వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ !

ఇటీవల ‘దేవర’ ప్రమోషన్లలో ఎన్టీఆర్ తన అభిమాన దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సాధారణంగా హీరోలు ప్రమోషన్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు, కానీ ఎన్టీఆర్ కోరిక నిజమైనదే. వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేశారు. ఇటీవల ఎన్టీఆర్‌కు కథ వినిపించారు. వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్‌ను కలిశానని, కథ చెప్పానని, త్వరలోనే మా కాంబో ఉంటుందని ప్రకటించారు.

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభించాలి. అక్టోబర్ 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. 40 రోజుల తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. జనవరి నుంచి మరో షెడ్యూల్ మొదలవుతుంది. ఎన్టీఆర్ కూడా అప్పుడే సెట్లో అడుగు పెడతారు. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన వెంటనే ‘దేవర 2’ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత వెట్రిమారన్ సినిమా ఉంటుంది. ఈలోగా వెట్రిమారన్ మరో సినిమా పూర్తి చేస్తారు. ఈనెల 27న ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వచ్చే ఏడాది ‘వార్ 2’ విడుదల అవుతుంది.