కత్తి, స్వామిజీ బహిష్కరణ వెనక.. !
రాముడు, రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, ఆయనపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నుంచి యాదాద్రికి పాదయాత్రకు సిద్ధమైన పరిపూర్ణానంద స్వామీని నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసింది. వీరిద్దరిని ఏపీలో వదిలేసి వచ్చారు హైదరాబాద్ పోలీసులు. మరో 6నెలల పాటు హైదరాబాద్, అసలు తెలంగాణలోనే అడుగుపెట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు.
కత్తి మహేష్ ని బహిష్కరించినప్పుడు పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ, స్వామిజీపై చర్యలు తీసుకొంటే.. వ్యతిరేకత రీ- సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. స్వామీజీ భక్తులు, బీజేపీ నేతలు పోలీసుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి.. తదితరులు స్వామీజీకి అన్యాయం జరిగిందని గవర్నర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ నిజాంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం నేతలపై ఈ రకమైన చర్యలు తెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి శాంతి భద్రతలకు పెద్ద పీఠ వేస్తోంది. ఈ నేపథ్యంలోనే మత ఘర్షణలకు ఊతమిచ్చే ఘటనపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా, కత్తి, స్వామిజీల నగర బహిష్కరణ వెనక కేసీఆర్ ఉన్నాడట. పోలీసులు ధైర్ఘ్యంగా ముందుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. నాలుగేళ్ల పాటు తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. ఇకపై కూడా అదే వాతావారణం కొనసాగేందుకు కత్తి, స్వామిజీలపై బహిష్కరణ వేటు వేసినట్టు అర్థమవుతోంది.