ఎంబీబీఎస్ బి కేటగిరీ కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్..
ప్రైవేట్ వైద్యవిద్య కళాశాలల్లోని బి కేటగిరీ మేనేజ్ మెంట్ కోటా (బి , సి ) ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు. ఈ నెల 17 నుండి జులై 19వ తేదీ వరకు ఆన్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు ప్రొఫెసర్ జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రం (పి జి ఆర్ ఆర్ సి డి ఈ), ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు చేసారు. ఈ నెల 11 వ తేదీన యూనివర్సిటీ విడుదల చేసిన మేనేజ్మెంట్ కోటా మెరిట్ జాబితా లోని అభ్యర్థులు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ర్యాంకుల వారీగా కెటియించిన తేదీలలో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారాన్ని www.knruhs.in లో చూడవచ్చు.