నటుడు వినోద్ అరిశెట్టి కన్నుమూత
సీనియర్ నటుడు వినోద్ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్‌స్ర్టోక్‌తో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ్, హిందీ, జోథ్ పురి.. పలు బాషల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. పలు సీరియళ్లలోనూ నటించారు.
వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్‌గా ఎక్కువగా కనిపించేవారు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్, మిర్చి.. తదితర చిత్రాల్లో వినోద్ నటనకి మంచి గుర్తింపు వచ్చింది.
తెనాలి ప్రక్కన నందివేరు. కాలేజీ రోజుల్లోనే నటకాలు వేసేవారు. అప్పటి నుంచి వినోద్ సినిమాలపై ఆసక్తి పెరిగింది. మద్రాస్ వెళ్లి సినిమా ప్రయత్నలు చేశారు. మొదట తమిళ్ అవకాశాలొచ్చాయ్. అక్కడ దాదాపు 35 సినిమాలు చేశారు. ఇందులో 10కిపైగా హీరోగా చేశారు. ఆ తర్వాత తెలుగులోనూ హీరోగా, ఆ తర్వాత విలన్ గా పలు సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా చేసిన ‘నల్లతాచు’ బాగా ఆడింది.