సామ్’ది గొప్ప మనసు
సమంత గొప్ప మనసున్న నటి అనిపించుకుంటోంది. చైతూతో పెళ్లి తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకొంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో
దూసుకెళ్తుతోంది. అదే సమయంలో సామాజిక సేవ కార్యక్రమాలని కొనసాగితోంది. ఆమె ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్స్ ద్వారా అనేక మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించి, వారి జీవితాల్లో వెలుగు నింపారు.
సామ్ మరోసారి తన మంచి మనసు నిరూపించుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. గత 70 ఏళ్లుగా ‘ఫోనాక్’ అనే సంస్థ వినికిడి లోపం ఉన్న చిన్నారుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తోంది. ఇదే సంస్థ ‘ఏ యూనిట్ ఆఫ్ హియరింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’తో కలిసి వినికిడిలోపంతో బాధ పడుతున్న చిన్నారులను గుర్తించేందుకు ఉచిత శిబిరాలు నిర్వహిస్తోంది.
ఈ సంస్థకు ఏపీ, తెలంగాణాలో 36 శాఖలు ఉన్నాయి. శుక్రవారం ఈ సంస్థ కార్యాలయానికి సమంత వెళ్లారు. వినికిడి లోపంతో బాధపడుతున్న పది మంది చిన్నారులకు వినికిడి యంత్రాలు అందించారు. భవిష్యత్తులో కూడా ఈ సంస్థకు తన వంతు సహాయం అందిస్తానని సామ్ హామీ ఇచ్చింది.