భూవివాదంలో మంత్రి జూప‌ల్లి బెదిరింపులు…!?

కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని కోమటిరెడ్డి హనుమంత్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూవివాదంలో మంత్రి జూపల్లి కృష్ణారావు త‌ల‌దూర్చార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపుల ఆడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ధర్మారం పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న భూమికబ్జా విషయంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అనుచరులుపై గతంలో ఆరోపణలు వ‌చ్చాయి.

దీర్ఘకాలిక‌ వ్యాధితో బాధ‌పడుతున్న కోమటిరెడ్డి హనుమంత్ రెడ్డి కూతురు గుర్రం లక్ష్మిని ఈ కేసు విషయంలో రెండేళ్లుగా తిప్పించుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలంటూ జూపల్లి కృష్ణారావు పీఎస్ఓ వీరారెడ్డిని సీఐ జనార్ధ‌న్ రెడ్డి విజ్ఞప్తి చేశారట‌. మంత్రి జూపల్లి కృష్ణారావు బెదిరించాడ‌ని కూడా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. గంటలో నీ జాబు ఊడుతుందంటే ఐజి నుండి ఫోన్ కాల్ వస్తుందంటూ హెచ్చరికలు చేయ‌డంతో డీజీపీ వ‌ద్ద తేల్చుకుందామ‌ని సీఐ బ‌దులు చెప్పాడ‌ట‌.ఇప్పుడు ఈ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ల ఆడియో వైర‌ల్ అవుతోంది.