ఆ తొమ్మిది రోజులు భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం బంద్…!!
తొమ్మిదిరోజుల పాటు తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతి నిరాకరిస్తూ టీటీడీ పాలకమండలి నిర్నయం తీసుకుంది. తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 9 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు నడకదారి,ఘాట్ రోడ్డులలో భక్తులకు అనుమతి నిరాకరించారు. ఈ తొమ్మిదిరోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు జరగనున్న నేపధ్యంలో ఏర్పాట్ల పై సమావేశంలో సమీక్షించారు.