నో డౌట్.. ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ !

రిలీజ్’కు ముందే ఎన్టీఆర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోయింది. క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. ఈ బయోపిక్ కోసం దర్శకుడు ప్రతీది పక్కగా ప్లాన్ చేసుకొంటున్నారు. ముందుగానే రిలీజ్ డేటుని ప్రకటించేశారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ‘ఎన్టీఆర్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇప్పటికే ‘ఎన్టీఆర్’ రంగంలోకి దిగారు. ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొన్నాడు. రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. ఈ నెల 18 నుంచి 24 వరకు రెండో షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ, విద్యాబాలన్ మధ్య సాగే భావోద్వేగమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బసవతారకమ్మని ఎన్టీఆర్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. సినిమాలోనూ వీరి ప్రేమ-పెళ్లి ఏపీసోడ్ ఉందట. అది ఎన్టీఆర్ అభిమానులకు బాగా నచ్చేలా ఉంటుందని చెబుతున్నారు. ఇక, బసవతారకంగారి పాత్రకు విద్యాబాలన్ తన నటనతో నిండుదనం తెస్తుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది.

దాదాపు రూ. 50కోట్లతో ‘ఎన్టీఆర్’ జీవిత కథని తెరకెక్కిస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. బహుశా.. తండ్రి ఎన్టీఆర్ తనకున్న ప్రేమ బాలయ్యతో భారీగా ఖర్చు పెట్టిస్తుండవచ్చు. ఐతే, ఇప్పటికే తెలుగు తెరపై ఎన్టీఆర్ హవా మొదలైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కు రేంజ్ లో డిమాండ్ ఏర్పడినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ. 12కోట్లకు బేరం కుదిరినట్టు తెలిసింది. మిగితా హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొందని చెబుతున్నారు.

ఎన్టీఆర్ జీవిత కథ స్టార్స్ తో నిండిపోయింది. మోహన్ బాబు, మహేష్ బాబు, నాగ చైతన్య, రానా దగ్గుపాటి, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, అనసూయ.. తదితరులు ఎన్టీఆర్ బయోపిక్ లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. రిలీజ్ కి ముందే ఎన్టీఆర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోయింది. మిగిలింది.. ఎన్ని రికార్డులెన్నో బద్దలుకొడుతుందన్నదే తేలాల్సి ఉంది.