కేంద్రంలో టీడీపీకి టీఆర్ఎస్ సపోర్టు
తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టీడీపీ, టీఆర్ఎస్’లు ఒకదానికొకటి సాయం చేసుకొనేలా కనబడుతున్నాయి. కేంద్రంపై టీడీపీ చేయనున్న పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. విభజన హామీల అమలుపై టీడీపీ పోరాటాన్ని ఉదృతం చేయనుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని మరోసారి నిలదీయనుంది. అవసరమైతే కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం పెట్టడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇతర పార్టీల మద్దతుని కూడగట్టే ప్రయత్నంలో ఏపీ-టీడీపీ నేతలు ఉన్నారు.
ఇందులో భాగంగా నేడు (ఆదివారం) హైదరాబాద్ లో టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, జితేందర్ రెడ్డిలని కలిశారు. విభజన హామీలపై వచ్చే పార్లమెంట్ సమావేశంలో తాము చేయబోయే ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు టీఆర్ ఎస్ ఎంపీలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారమ్. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాం.. దానికి టీఆర్ఎస్ మద్దతు కోరాం. వారు సానుకూలంగా స్పందించారు అన్నారు ఎంపీ సుజనా.
టీడీపీకి సపోర్టు వెనక టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాం దాగివున్నట్టు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్ అందుకోలేనట్టయితే.. టీడీపీ మద్దతు అవసరమవుతోంది. తెలంగాణలో టీడీపీ దివాళ తీసిన.. ఇప్పటికీ ఆ పార్టీకి క్యాడర్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో పలు సీట్లు గెలుచుకొనే సత్తా టీడీపీ ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్రంలో టీడీపీకి మద్దతిచ్చి.. అవసరమైతే రాష్ట్రంలో ఆ పార్టీ సపోర్టు తీసుకొనే ఆలోచనలో టీఆర్ ఎస్ ఉన్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి.. టీడీపీ-టీఆర్ ఎస్ ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వెలుతున్నాయని చెప్పవచ్చు.