సన్నీకి టైటిల్ కష్టాలు

బాలీవుడ్’లో రాణిస్తున్న శృంగార తార సన్నీలియోన్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఆమె జీవిత కథ ‘కరణ్‌జిత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్కు’ పేరిట వెబ్ సిరీస్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. శృంగార తార నుంచి బాలీవుడ్ హాట్ బ్యూటీగా ఎదిగిన మైనాని ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు. సన్నీ పాత్రలో రైసా సౌజానీ కనిపించనుంది.

సన్నీ బయోపిక్’కు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. టైటిల్‌ విషయంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. టైటిల్‌ లో ‘కౌర్’ను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ‘కౌర్’ను ఉపయోగించడం వల్ల సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని ఎస్‌జీపీసీ అంటోంది. ‘కౌర్’ పదం ఎంతో పవిత్రమైంది. దాన్ని వాడుకొనే అర్హత సన్నీకి లేదని అంటున్నారు. టైటిల్ నుంచి కౌర్ పదాన్ని తొలగించాలి. దాంతోపాటు.. సన్నీలియోన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సన్ని ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

ఇక, సన్నీ బయోపిక్ లో శృంగార సన్నివేశాలు ఉంటాయని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. బహుశా.. అభిమానులని సన్నీ డిసపాయింట్ చేయకపోవచ్చు. ఈనెల 16న ఓ ఆంగ్ల ఛానల్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.