జమిలి ఎన్నికలకు మద్దతిచ్చిన సూపర్ స్టార్
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ నినాదంతో కేంద్రం జమిలి ఎన్నికలని తెరమీదకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలపై లా కమిషన్ వివిధ పార్టీల అభిప్రాయాలని సేకరించాయి. కొన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇస్తుంటే, మరికొన్ని వ్యతిరేకంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ నినాదంతో కేంద్రం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల విధానం మెచ్చుకోదగినది. దీనివల్ల సమయం, డబ్బు ఎంతో ఆదా అవుతాయి. అన్ని పార్టీలు ఇందుకు మద్దతు ఇస్తే బాగుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉంటే జమిలి ఎన్నికలను సులభంగా నిర్వహించవచ్చు’ అన్నారు రజనీ. ఇక, తెలంగాణంలో టీఆర్ఎస్, తమిళనాడు ఏఐఏడీఎంకే, యూపీలోని సమాజ్వాద్ పార్టీలు జమిలీ ఎన్నికలని స్వాగతించాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు, దేశంలోని మిగితా రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ గత యేడాది డిసెంబర్ లోనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. ఐతే, ఇప్పటి వరకు పార్టీ పేరుగానీ, గుర్తు గానీ ప్రకటించలేదు. 2019 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇదీగాక, ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తుకు వెళ్దామనే ఆలోచన కూడా చేస్తున్నారు. అయినా.. రజనీ ఇంకా తొందరపడకపోవడం ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది.