రౌడీ దుస్తులు తీసుకొచ్చిన విజయ్ దేవరకొండ

సినీ స్టార్స్ బిజినెస్ లోకి దిగడం సాధారణమే. టాలీవుడ్ హీరోల్లో చాలా మంది ఇప్పటికే సైడ్ బిజినెస్ చేసుకొంటున్నారు. యంగ్ హీరోలు నితిన్, సందీప్ కిషన్.. బిజినెస్ పెట్టేశారు. ఇప్పుడీ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయారు. విజయ్‌ దేవరకొండ ‘రౌడీ’ అనే దుస్తుల బ్రాండ్‌ను విడుదల‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ‘రౌడీ సన్‌డౌనర్‌ పార్టీ’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ‘రౌడీ’ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు.

” ‘రౌడీ’ నా డ్రీమ్‌. నా స్నేహితులతో కలిసి దీన్ని ప్రారంభించాం. నాకు ఫైనల్‌గా నచ్చిన బట్టలు దొరికాయ్‌ రో!!. ప్రతి వారం కొత్త రకాన్ని ప్రవేశపెడతాం. నాకు సోషల్‌మీడియా ఇష్టం లేదు. కానీ, మీకు దగ్గరగా ఉండాలని నడుపుతున్నా. ‘రౌడీ’ కూడా నన్ను మీకు దగ్గర చేస్తుంది. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి” అని తన బ్రాండ్‌ ని ప్రమోట్ చేశారు విజయ్ దేవరకొండ.